*కాంగ్రెస్ గెలిస్తే రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ* వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు వాసరి లింగారావు అన్నారు బుధవారం మండల పరిధి వెలికట్ట క్రాస్ రోడ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. భారసా ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. యాసంగి లో వరి పంట అకాల వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోయారని అన్నారు. ఎకరాకు పదివేల పరిహారం ఇచ్చి ఆదుకుంటామని చెప్పిన భారసా నాయకులు ఇంతవరకు నయా పైస ఇవ్వలేదని విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు మరోసారి సాగుచేసిన పంటలు నష్టపోయారని వెంటనే రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే యాసంగిలో పంట నష్టపోయిన రైతులకు పరిహారంను రైతుల ఖాతల్లో జమ చేయాలి. లేని యెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధులు, భాను ప్రకాష్ ,సతీష్ పరశురాములు, అంజయ్య, చంద్రయ్య, తదితరులు ఉన్నారు.
