– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి
దౌల్తాబాద్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాహీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గోవిందా పూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మృతుల కుటుంబాలకు ప్రజాహిత ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. అలాగే మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బ అశోక్ గుప్తా కుటుంబీకులు రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, దౌల్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు నరసింహారెడ్డి, బీఆర్ఎస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చింటూ నాయకులు శ్రీనివాస్ చారి, సుదర్శన్, రాజిరెడ్డి, ఎల్లం, సందీప్, ప్రవీణ్, నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు…..