Breaking News

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారా అయితే కొండపిండి ఆకు వాడండి*

132 Views

*కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారా అయితే కొండపిండి ఆకు వాడండి*

 

కొండ పిండి ఆకు వల్ల ఉపయోగాలు. కిడ్నీలో గాని మూత్ర నాళాల్లో గాని రాళ్లు (స్టోన్స్) ఏర్పడి కొంత మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంత మంది వేలాది రూపాయలు ఆసుపత్రులకు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకుంటారు. మరికొంత మంది రాళ్లు ఏర్పడి వారు స్టోన్స్ కరిగిపోవడం కోసం మందులను వాడుతుంటారు. రాళ్ల సైజును బట్టి కొంతమందికి కరిగిపోవడం జరుగుతుంటుంది. మరికొంత మందికి ఆపరేషన్ తప్పనిసరి అవుతుంది. కాగా రాళ్లను కరిగించడానికి ఆయుర్వేదంలో మందును వినియోగిస్తున్నకారు. పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగా నైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతుంటారు. ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగిస్తున్నవారు. ఈ ఆకు పేరు ఎలా వచ్చిందోగాని పేరులోనే ఉంది కొండను పిండిచేసే చెట్టు. 5నుండి 8mmలోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్ధారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం ప్రారంభించాలి. ఉదయం పూట పరిగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సిలో టీ కప్పు రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జిలుకర్ర, నవ్వోతు (పటికబెల్లం) పొడిగా తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల వరకు రాళ్లు కరిగి పోవడం లేదా రాళ్లు పడిపోవడం జరుగుతుంది. అంతకన్న ఎక్కువ రోజులు త్రాగిన కలిగే నష్టమేమి ఉండదు. ఈ విషయాన్ని కొంత మంది విశ్వసించక పోవచ్చుగాని ముమ్మాటికి వాస్తవం. ఎటువంటి సైడ్ ఎఫెక్టులేని ఈరసంతో చాలా మందికి రాళ్లు పడిపోవడం, కరిగిపోవడం జరుగుతుంది. కాగా కొండ పిండి ఆకును కూరగా కూడా వండుకొని తింటే మంచిఫలితాలుంటాయని వినియోగించిన వారిని అడిగితే తెలుస్తుంది. అయితే కొండపిండి ఆకు ఎక్కడ దొరుకుతుందో అనే విషయాన్ని తెల్సుకుంటే రాళ్ల నొప్పితో బాధపడే వారి బాధలు పరిష్కారమైనట్లే.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *