దౌల్తాబాద్: రైతు బీమా కు దరఖాస్తు చేసుకోవాలని ఏ ఈ ఓ లు రాజు గౌడ్, మాధవి లు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తోపాటు గోవిందా పూర్, ఉప్పర్ పల్లి, తిరుమలాపూర్ తదితర గ్రామాల్లో రైతుల నుండి రైతు బీమా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చేనెల 5వ తేదీ వరకు రైతు బీమా దరఖాస్తు చేసుకోవచ్చని రైతు బీమా కోసం రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, నామిని ఆధార్ కార్డ్ జిరాక్స్ లతో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు….
