ప్రాంతీయం

సంఘం చెరువు మత్తడిని పరిశీలించిన జడ్పిటిసి తహసిల్దార్

120 Views

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో విరిగిన సంగం చెరువు మత్తడి .
పరిశీలించిన జెడ్పీటీసీ,తహశీల్దార్.
మండలంలోని గొల్లపల్లి సంగం చెరువు మత్తడి విరిగి శిథిలావస్థకు చేరింది . సమాచారం అందుకున్న జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు,తహశీల్దార్ జయంత్ సంగం చెరువు మత్తడిని పరిశీలించారు.గత అరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కు వరద నీరు సంగం చెరువులోకి చేరుతుంది.తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మైసమ్మ చెరువు మత్తడి పరుతుండటం తో క్రిందనున్న గొల్లపల్లి సంగం చెరువులోకి నీరు వస్తుండటం తో చెరువు మత్తడి నీటి ప్రవాహము నకు పూర్తిగా ధ్వంసం అవుతుందని ,తద్వారా చెరువుకు బుంగ పడే అవకాశం ఉందని గ్రామ ప్రజా ప్రతినిధులు,రైతులు ఆందోళన చెందడం తో చెరువు మత్త డిని వెంటనే మరమ్మతులు చేయాలని సంభందిత అధికారులను జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు కోరారు.ఈ కార్యక్రమంలో టి అర్ ఎస్ నాయకులు పాశం దేవ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు జబ్బార్,దేవుని గుట్ట సర్పంచ్ పెంటయ్య,వార్డు సభ్యుడు దాసరి గణేష్, మాజీ ఏ ఎం సీ చైర్మెన్ నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7