రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రం నుండి దుమాల గ్రామానికి వీర్నపల్లి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి , గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వీర్నపెల్లి వద్ద వాగు , ఎల్లారెడ్డి పేట మండల కేంద్రం నుంచి దుమాల మధ్య గల రాపెల్లి వాగుపైన బిడ్జీ నిర్మాణం పూర్తికాక పోవడం తో రాపెల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో బుధవారం రాకపోకలకు అంతరాయం ఎర్పడింది , గిద్దచెరువు నిండిపోయి బుధవారం పొంగిపొర్లుతుండడంతో రాపెల్లి వాగులో నీటి ఉదృతి ఎక్కువ కావడంతో తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డును జడ్పీటీసీ సభ్యులు చీటీ లక్ష్మన్ రావు ,అదికారులతో కలిసి బుధవారం జెసిఫి సహాయంతో తొలగించి వేశారు , దీంతో మండల కేంద్రానికి దుమాల ,అక్కపెల్లి , బుగ్గ రాజేశ్వర తండా , అల్మాస్పూర్ , రాజన్నపేట కింది తండా వీర్నపెల్లి మండల ప్రజల కు రాకపోకలు నిలిచిపోయాయి , దీంతో ఆయా గ్రామాల ప్రజలు దుమాల నుండి రాగట్లపల్లి కి , రాజన్నపేట , రాచర్ల గొల్లపల్లి మీదుగా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి చేరుకోవల్సి వస్తోంది ,






