చినుకు పడితే చిత్తడైన రాజీవ్ రహదారి
# ఇదేనా అభివృద్ధి అంటే
# కలెక్టర్ కార్యాలయం ముందు gunthallu పడ్డ రోడ్లు
# తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
# టోల్ టాక్స్ తీసుకున్నప్పుడు రోడ్లు ఎందుకువేయరు
# నామమాత్రంగా రోడ్లు వేసి కోట్లు దండుకుంటున్న హెచ్ కె ఆర్ సంస్థ
# రోడ్లు బాగు చేయకపోతే గుంతలలో కాంగ్రెస్ జెండా పెట్టి నిరసన తెలుపుతాం
# సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్
సిద్ధిపేట;
రెండు మూడు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికి రాజీవ్ రహదారి రోడ్లు మొత్తం పాడైపోయాయని ఇదేనా అభివృద్ధి అంటే అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందమైన రోడ్లు వేసామని గొప్పలు చెప్పుకుంటుందని వాస్తవానికి నాసిరకం పనులు చేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజీవ్ రహదారితోపాటు సిద్దిపేటలోని పలు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుందని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాజు రహదారిని ఏర్పాటు చేస్తే మూలమలుపులు రోడ్లు బాగాలేవని గతంలో బిఆర్ఎస్ పార్టీ ఆరోపించిందని అన్నారు. మరి ఇప్పుడు ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ మూలమలుపు రోడ్లు ఎందు ఎందుకు బాగు చేస్తలేరని అన్నారు. సిద్దిపేటలోని కలెక్టర్ కార్యాలయం వరకు రోడ్లు గుంతలు పడి అద్వానంగా మారాయని దానిని పట్టించుకునే నాధుడే లేరని అన్నారు. సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చిన ప్రభుత్వం హెచ్ కె ఆర్ సంస్థ టోల్ టాక్స్ తీసుకున్నప్పుడు రోడ్లు ఎందుకు వేయదని ప్రశ్నించారు. రోడ్లు వెంటనే బాగు చేయకపోతే గుంతలలో కాంగ్రెస్ జెండాలు పెట్టి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట యువజన పట్టన అధ్యక్షులు గయాజుద్దీన్ పాల్గొన్నారు
