Breaking News

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. గోపి    కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బి. గోపి భాద్యతలు స్వీకరించారు.

130 Views

 

 

 

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. గోపి

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బి. గోపి భాద్యతలు స్వీకరించారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన ఆర్. వి. కర్ణన్ నల్లగొండ జిల్లా కలెక్టర్ గా బదిలీ అవడంతో, జిల్లా నూతన కలెక్టర్ గా డా: బి. గోపిని ప్రభుత్వం నియమించింది, ఈ సందర్భంగా బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను బి. గోపి స్వీకరించారు.

అంతకు ముందు కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ కు అయన చేరుకోగా అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం అయన రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి మరియు మానకోండుర్ శాసన సభ్యులు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమం లో అదనపు కాలేక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ఆర్ డి ఓ మహేష్, ఏ ఓ జగత్ సింగ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, కరీంనగర్ చే జారీ చేయనైనది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *