ముస్తాబాద్ జూలై 23, సైబర్ నేరాలు జరిగిన వెంటనె కేసులను నమోదు చేయాలని జిల్లాఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులను ఆదేశించిన మేరకు వెంటనే కేసులు నమోదు చేయడం ద్వారా సైబర్ నేరాల ద్వారా తొంగిలించబడిన డబ్బుల లావాదేవీలను నిలుపుదల చేసి బాధితులకు అందజేసే అవకాశం ఉంటుందని ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివిధ రకాల నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని డ్రంక్ అండ్ డ్రైవ్. నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని చెప్పారు. శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి సమాచారం అందిన సత్వరం స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని సేవలందిస్తామని తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ. వివిధ రకాల కేసుల చేదన కోసం ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయటంలో భాగంగా పోలీస్ అధికారులు ప్రతి కేసు వివరాలపై పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంటూ ప్రజల ప్రాణాలు కాపాడుటలో ముందు ఉంటామని తెలిపారు. ఆకస్మిక తనిఖీలతో అక్రమ కార్యకలాపాలు నియంత్రణలోకి వస్తాయని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు పరిష్కరించబడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసుల పరిష్కారం కోసం ఇరువర్గాలను సంప్రదించాలని తెలిపారు. ఈరోజు నలుగురిపై కేసు నమోదు చేశామని తదుపరి వారి తల్లిదండ్రులను పిలిపించుకొని కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టుకు పంపిస్తామన్నారు. ఈకార్యక్రమంలో చంద్రశేఖర్, దామోదర్, కాషీం పోలీస్ సిబ్బంది ఉన్నారు.
