ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 10, 1). వీర్ణపల్లి గ్రామానికి చెందిన దేశరాజు చంద్రకళ – దేవయ్య చారి కూతురు స్వప్న వివాహం తేది 12-5-2023 రోజున ఉన్నందున అలాగే 2).వీర్ణపల్లి మండలం ఎర్రగడ్డ తండాకీ చెందిన బుక్య చిన్యనాయక్ – ఐలా కూతురు మహేశ్వరి వివాహం తేది 12-5-2023 శుక్రవారం వీరిరువురి పెండ్లిలకీ తనవంతు సహాయంగా పుస్తె-మట్టెలు, గాజులు, పెండ్లి చీర ఆందజేసి అండగా నిలిచిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూతనందించారు. ఈసందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపిన వధువు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు ఉన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, బొడ మల్లేశం, పోతారం నరేష్, తొవుటు అజయ్, గుండెల్లి వేణు, తడుక విజయ్, భాస్కర్ రామకృష్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
