Breaking News

45 ఏళ్ల తర్వాత యమునా నది మహోగ్ర రూపం*

75 Views

*45 ఏళ్ల తర్వాత యమునా నది మహోగ్ర రూపం*

*న్యూఢిల్లీ : ఉత్తరాదిన భారీ వర్షాలు జలప్రళయం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి చరిత్రలో తొలిసారి నది నీటి మట్టం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది.*

 

దీంతో అనేక కాలనీల్లో వరద నీరు ముంచెత్తింది. కేంద్ర జల కమిషన్ సమాచారం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.55 మీటర్లకు పెరిగింది.

 

హర్యానా నుంచి నీటిని విడుదల చేయడంలో ఢిల్లీలో యమునా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈనది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు కాగా, ఆ మార్క్‌ను రెండు రోజుల క్రితమే దాటింది. 2013 తర్వాత మళ్లీ బుధవారం ఉదయమే 207 మార్క్‌ను తాకిన నది నీటి మట్టం… ఈ మధ్యాహ్నానికి ఏకంగా 207.55 మీటర్లుగా నమోదైంది. ఈ స్థాయిలో నది నీటి మట్టం పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నది గట్టును పటిష్ట పర్చడానికి, లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించే కార్యక్రమాలు డిల్లీ ప్రభుత్వం చేపడుతున్నట్టు రెవెన్యూ మంత్రి అతిషి చెప్పారు.

 

వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, విపత్తు నివారణ చర్యలు వీలైనంతవరకు తీసుకొంటున్నామని జలవనరుల మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. యమునా నదిలో పూడుక పేరుకు పోవడమే నది మట్టం అమాంతంగా పెరిగిపోడానికి కారణమని డామ్స్, రివర్స్, పీపుల్ (ఎస్‌ఎఎన్‌డిఆర్‌పి) సౌత్ ఆసియా నెట్ వర్క్ అసోసియేట్ కో ఆర్డినేటర్ భీమ్‌సింగ్ రావత్ అభిప్రాయ పడ్డారు. వజీరాబాద్ నుంచి ఒఖ్లా వరకు 22 కిమీ పరిధిలో నదీ పరివాహక ప్రాంతంలో 20 వంతెనలు, మూడు బ్యారేజీలలో పూడిక తీయక పోవడంతో నదినీటి మట్టం అనూహ్యంగా పెరిగిపోడానికి దారి తీసిందని చెప్పారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *