మెదక్: ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేరల్లోకి రానియొద్దు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరికొట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మాటలపై నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మతిలేనివన్నారు.
రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ ఇలా పలు రకాల రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ దేశానికి రోల్‌మాడల్‌గా నిలిచింది. అదుకే రైతాంగంపై కాంగ్రెస్ కక్ష కట్టింది. ఓవైపు బీజేపీ వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే మరోవైపు కాంగ్రెస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దు అని రైతుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ శాసనసభ్యుడు చిలుముల మదన్ రెడ్డి
మెదక్ జిల్లా అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబందు నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
