Breaking News

మండల్ వర్గల్ : మేలు రకం పశుసంపద ఉత్పత్తితోనే అధిక ప్రయోజనం

81 Views

మేలు రకం పశుసంపద ఉత్పత్తితోనే అధిక ప్రయోజనం

ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు గనుప లక్ష్మారెడ్డి

మేలు రకం పశు సంపద ఉత్పత్తితోనే రైతులకు అధిక ప్రయోజనం ఉంటుందని ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గనుక లక్ష్మారెడ్డి పేర్కొన్నారు . దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం అవుసులోని పల్లిలో మేలు జాతి లేగ దూడల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు . పశువుల్లో కృత్రిమ గర్భధారణ ఫలితంగా మేలు రకం , సంకరజాతి లేగ దూడల ఉత్పత్తి ఉండి వాటి సంరక్షణతోనే విస్తృత ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపారు . నట్టల నివారణ చర్యలు తీసుకొని పక్షంలో ఏలిక పాములు , జలగలు , బద్దె పురుగులు వంటి అంతర పరాన్న జీవులు జీర్ణాశయము , పేగులలో ఉండి పోషక పదార్థాలు దూడకు అందనివ్వకుండా రక్తాన్ని పీల్చి బలహీనం చేస్తాయని పేర్కొన్నారు .
నట్టల వలన దూడలు ఎదగకుండా బలహీనంగా సన్నగా ఉంటాయని , దీని దృష్టిలో పెట్టుకొని నట్టల నివారణ మందు వేయాలని సూచించారు . ఆలాగే గాలికుంటు , గొంతువాపు , దమ్మ రోగం , బ్లూసెల్లాసిస్ వంటి అంటు రోగాలు సోకే ప్రమాదం ఉంటుందని , దీనిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు టీకా ఇవ్వాలని స్పష్టం చేశారు . ఎండు గడ్డిలో ఉండే సెల్యూలోస్ ను లేగ దూడలు జీర్ణించుకోలేవని , పప్పు జాతి లేత ఆకులు లేగ దూడలకు ఆహారంగా అందించాలని అన్నారు . పశు సంపద ఉత్పత్తి , సంరక్షణ లక్ష్యంగా జిల్లాలో 150 మంది గోపాల మిత్రలు ఇంటింటికి తిరుగుతూ పశువులను వ్యాధుల బారిన పడకుండా చికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు . రైతుల నుండి విజయ డైరీ నేరుగా పాలు సేకరిస్తుండగా , పాడి రైతులకు రుణ సదుపాయం సైతం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు . సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చర్యలు తీసుకుంటుండగా , పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్ , ఎంపీపీ అధ్యక్షులు లతా రమేష్ గౌడ్, జెడ్పిటిసి బాలు యాదవ్ , మండల వైస్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి , పశు వైద్యాధికారి సృజన , గోపాలమిత్రుల సంఘం రాష్ట్ర నేత రాంబాబు , జిల్లా అధ్యక్షులు సింగం రాజు , గోపాలమిత్రలు షాదుల్లా , భాస్కర్ గౌడ్ , స్వామి , సత్తార్ , సురేష్ , అఫ్జల్ ,
యాదగిరి , ఆంజనేయులు , రవి పాల్గొన్నారు .

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *