ముస్తాబాద్, ప్రతినిధి జూన్18, తుర్కపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అపర భగీరథుడు కేసీఆర్ తలపెట్టిన తెలంగాణ మంచినీళ్ల పండగ కార్యక్రమాన్ని సర్పంచ్ కాసోల్ల పద్మ-దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా వస్తున్న నీళ్లను ప్రతిఒక్కరూ వినియోగించుకొని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుండం నర్సయ్య, ఉప సర్పంచ్ కృష్ణవేణి, గ్రామ కార్యదర్శి సిద్దుల శ్రీనివాస్, వార్డు మెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జవ్వాజి బాలకృష్ణ, మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రోడ్డ దేవదాస్, బిఆర్ఎస్ నాయకులు అంకని రంజిత్, మిషన్ భగీరథ పంపు ఆపరేటర్ మహేష్, ఈవో జమున, అంగన్వాడి బాలలక్ష్మి, ఆశా వర్కర్ భారతి, బిఆర్ యస్ నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.
