ప్రాంతీయం

రేషన్ కార్డుల్లో పేర్లులేక బీసీబంధుకు నోచుకోని గల్ఫ్ రిటనీలు…

234 Views

 ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 19, కులవృత్తులు చేసుకునే బీసీలకు రూ.లక్ష సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చి గ్రామాలలో స్థిరపడ్డ కొందరు బీసీల పేర్లు రేషన్ కార్డుల్లో లేనందున ఈ పథకంకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మపల్లిలో సోమవారం (19.06.2023) గల్ఫ్ కార్మికుల అవగాహన చైతన్య కార్యక్రమం నిర్వహించిన సందర్బంగా గల్ఫ్ జెఏసి బృందం పలువురు గల్ఫ్ రిటనీలను కలుసుకున్నారు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పునరావాస, పునరేకీకరణ ప్యాకేజీలను ప్రకటించాలని రవిగౌడ్ కోరారు. అలాగే గల్ఫ్ వెళ్లే కార్మికులు 325 రూపాయల ప్రవాసి భారతీయ భీమాయోజన 10.లక్షల ప్రమాద భీమా తప్పనిసరిగా చేసుకోని వెళ్లాలని సూచించారు. ఈకార్యక్రమంలో గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేంధర్, నాయకులు నాగురి సమ్మయ్య, వేల్పుల సతీష్, దొబ్బల భూమయ్య,చందనగిరి శంకర్ యుండి.ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *