ముస్తా
బాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 30, బహుజన్ సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షురాలు బెహేన్జీ కుమారి మాయావతి పర్యటన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు సూడిది నవీన్ మాట్లాడుతూ వచ్చే నేల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో తెలంగాణ భరోసా సభ నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు భావి భారత ప్రధాని బెహేన్జీ కుమారి మాయావతి వస్తున్నారని తెలిపారు. ముస్తాబాద్ మండలం నుండి పెద్ద సంఖ్యలో బహుజనులంతా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదే విధంగా ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే పీడిత ప్రజల బ్రతుకులు మారుతాయని తెలియజేశారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ సోషల్ మీడియా ఇంచార్జి సుంచు చందు ,మండల కోశాధికారి మానిగారి హరిబాబు, సోషల్ మీడియా ఇంచార్జి మీస దేవరాజు, కార్యదర్శి ఏల రవి, పట్టణ అధ్యక్షుడు సుంచు అరుణ్ ,ఉపాధ్యక్షుడు పులి అనిల్ ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు.
