కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి,గ్రామంలో శ్రీ పుట్టల మల్లన్న ఎల్లమ్మ దేవాలయంలో ఘనంగా పుట్టల మల్లన్న, మేడాలమ్మ కేతమ్మ, ఎల్లమ్మ మునిరాజు,ల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. నిమ్మపల్లి బావుసాయిపేట, వట్టిమల్ల, తదితర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పుట్టల మల్లన్న కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చేకుట మహేష్, వైస్ చైర్మన్ ఎక్కల దేవి కొమురయ్య, మాజీ చైర్మన్ పబ్బ అంజయ్య, సర్పంచులు కదిరే శ్రీనివాస్, కేంద గంగాధర్, మానుక సత్యం, చేపూరి గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
