Breaking News

బీడీ టేకే దారుల మోసాలను అరికట్టాలి

126 Views

– ఆకు, తంబాకు లో మోసం

– బీడీలు చేయ రానివారికి పిఎఫ్

– బీడీ కార్మికుల సమావేశంలో ఆవేదన

చందుర్తి – జ్యోతి న్యూస్

బీడీ కంపెనీల టేకే దారులు చేస్తున్న మోసాలను అరికట్టాలని మండలంలోని లింగంపేట గ్రామానికి చెందిన బీడీ కార్మికులు అన్నారు. గ్రామంలోని పాల కేంద్రం సమీపంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకుని టేకే దారులు చేస్తున్న మోసాలపై స్థానిక ఎంపీటీసీ పెగ్గెర్ల రమేష్ రావు కు వినతిపత్రం అందించారు. మజూరు తక్కువగా ఇవ్వడం, బీడీల లో కోతలు విధించడం, నాసిరకపు ఆకు వేస్తూ నాణ్యమైన బీడీలు తీసుకురావాలని అనడం, కొన్ని సంవత్సరాలుగా బీడీలు చుడుతూ ఉన్న చాలా మంది కార్మికులకు పిఎఫ్ లు లేకపోవడం, అసలు బీడీలే చుట్టని టేకే దారుల కుటుంబ సభ్యులకు పిఎఫ్ లు ఉండడం, అనారోగ్యంతో ఉన్నప్పటికి బీడీలు చుట్టాలని వేధిస్తూ ఉండడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ విషయమై స్పందించిన గ్రామ ఎంపీటీసీ  రమేష్ రావు మాట్లాడుతూ…. నేను కూడా మోసపోతున్న, బీడీ కార్మికుల కుటుంబ సభ్యులలో ఒక్కడినని, గతంలో నుండి పలు సమస్యలపై ఒంటరి పోరాటం చేస్తున్నాం అని అన్నాడు. బీడీ కార్మికులకు న్యాయం జరిగే వరకు తాను పోరాటం చేస్తానని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకాడబోనని అన్నారు. “బీడీ కార్మికుల సమస్యలు వదిలిపెట్టాలని అందుకు అవసరమైతే ఏమైనా చర్చించుకుందాం అని గత కొన్ని రోజులుగా తనకు కొంతమంది వ్యక్తులు ఫోన్ చేస్తున్నారని, అయినప్పటికీ తాను ఎవరికీ భయపడేది లేదని బీడీ కార్మికులకు న్యాయం జరిగేంత వరకూ, టేకే దారుల మోసాలకు అడ్డుకట్ట పడే వరకు తాను పోరాడతానని అన్నారు”. బీడీ కార్మికుల తరఫున తాను పోరాడుతూ ఉంటే తనపై కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నారు. ఏదిఏమైనా తాను కార్మికులకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు యువకులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna