ఎల్లారెడ్డి పేట మండలంలోని గొల్లపల్లి వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో అదే గ్రామానికి చెందిన బైరి నరేష్ నిర్వహిస్తున్న రిషిక కిరాణం షాపులో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు.
షాపు యజమాని బైరీ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుకు తెలిపిన వివరాల ప్రకారం నరేష్ మధ్యాహ్నం భోజనం చేయుటకు షాపు మూసివేసి ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చి చూడగా షాపువెనుక నున్న తలుపు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి అనుమానంతో షాపులోనీ లాకర్ ను చూశాడు.
షాపులోని లాకర్ పగులగొట్టి ఉండటంలాకర్ లోని మూడువేల రూపాయలు,వేణుగోపాల స్వామికి చెందిన మూడు ఇత్తడి చెంబులు,ఒక ఇత్తడి చెంబు దొంగించినట్లు గుర్తించాడు.
లాకర్ లోని మూడువేల రూపాయలు,అందుకున్న వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన మూడు ఇత్తడి చెంబులు,ఒక తాంబూలం మొత్తం 5 వేల రూపాయల విలువగల నగదు, సామాగ్రి దొంగిలించి నట్లు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి కేసు నమోదు చేశారు.
