పత్రిక స్వేచ్ఛ పై దాడికి వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
మీడియా పైన బీజేపీ దాడిని అపకపోతే ఉద్యమిస్తాం
ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ డిమాండ్
సిద్దిపేట: అక్టోబర్ 4
బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలను నిరంతరం ఎండగడుతూ ప్రజలకు చేరువ చేస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ మరియు హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను ఢిల్లీ పోలీసులు క్రూరమైన యూఏ పిఏ ఆరోపణలను ఉపయోగించి అరెస్టు చేశారని దీనిని భారత విద్యార్థి ఫెడరేషన్( ఎస్ ఎఫ్ ఐ)సిద్దిపేట జిల్లా కమిటీ ఖండిస్తుందని సిద్దిపేట జిల్లా కొత్త బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు
ఢిల్లీకి చెందిన పలువురు జర్నలిస్టుల ఇళ్లపై ‘రైడ్’ చేసి, వారి ల్యాప్‌టాప్‌లు & ఫోన్‌లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం స్థానం, దిగువ 20 దేశాలకు దిగజారడం ప్రమాదమని అన్నారు ప్రభుత్వం కు ప్రజలకు వారధి గా నాలుగో స్తంభం గా సూచించబడే మీడియా స్వేచ్ఛను భంగం కలిగించడం సరికాదని అన్నారు
బీజేపీ ప్రభుత్వం ఇలాంటి దిక్కుమాలిన చర్యలు ప్రజలు గమనిస్తున్నారని వారు అన్నారూ రానున్న రోజుల్లో ప్రజలు బుద్ది చెప్పి అధికార అహంకారాన్ని దించుతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు కొండం సంజీవ్ ,ఆముదాల రంజిత్ రెడ్డి, నాయకులు భాను , హరీష్, శ్రవణ్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు
