దొంగతనం కేసులో ఒక వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా.
దొంగతనం కేసులో వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.
ఈ మేరకు ఇన్స్పెక్టర్ మాట్లాడుతు….
సిరిసిల్ల అంబికానగర్ కి చెందిన అడేపు రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ పిల్లలు అమెరికాలో ఉన్నందున తేది 25.04.2023 రోజున వారి చూడడానికి అని అమెరికా వెళ్ళాడు.ఇల్లు ఖాళీగా ఉండకూడదని కొండా రంజిత్ అనే వ్యక్తికి కిరాయికి ఇవ్వగా రాజేంద్రప్రసాద్ అమెరికా నుండి 25.07.2023 రోజున కరీంనగర్ కి వచ్చి అక్కడే ఉండి సిరిసిల్లలోని అంబిక నగర్ లో ఇంటికి తేదీ 29.07.2023 రోజున ఉదయం 11 గంటలకు వచ్చి చూసేసరికి ఇంట్లో గల సోనీ టీవీ, హెచ్పీ గ్యాస్ సిలిండర్ సబ్మెర్సిబుల్ మోటర్ ఇంట్లో కిరాయికి ఉండే కొండ రంజిత్ దొంగతనం చేసినాడని సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై పి శ్రీనివాస్ రావు కేసు నమోదు చేసిన తర్వాత విచారణ అధికారి అయిన ఉపేందర్ సిఐ నిందితుడు ఆయన కొండ రంజిత్ ను అరెస్టు చేసి రిమాండ్ తరలించి అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా సి.ఎం. ఎస్. ఆర్.ఎస్. ఐ. శ్రావణ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ , ఎనిమిది (8) మంది సాక్షులను ప్రవేశపెట్టినారు.ప్రాసిక్యుశన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుముల సందీప్ వాదించగా కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రవీణ్ నేరస్తుడు అయిన కొండ రంజిత్ కు ఒక సంవత్సరం కఠిన కారాగార జైలు శిక్ష తో పాటు వేయి రూపాయల జరిమానా విదించడం జరిగింది అని సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్.కృష్ణ తెలిపినారు.
