భార్యను వేధించిన కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష.
భార్యను వేధించిన కేసులో భర్త కంది రమేష్ కి సిరిసిల్ల రెండవ అదనపు మెజిస్ట్రేట్ గడ్డం మేఘన మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువడించినట్లు తంగళ్ళపల్లి ఎస్ ఐ ఉపేంద్ర చారి తెలిపారు.
వివరాల ప్రకారం.
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన కంది పద్మ కి బద్దనపల్లి గ్రామానికి చెందిన కంది రమేష్ తో 2001 సంవత్సరంలో వివాహం జరిగింది.వీరికి ముగ్గురు పిల్లలు సంతానం కలదు రమేష్ మద్యంకు బానిస అయ్యి పద్మను, పిల్లలను నిత్యం వేధించేవాడు.ఈక్రమంలో 2017 జూలై 4న రమేష్ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యను డబ్బులు ఇవ్వాలంటూ వేధించాడు దానికి ఆమె అంగీకరించకపోవడంతో ఆమెను తీవ్రంగా కొట్టగా అడ్డువచ్చిన పద్మ తల్లిని కూడా కొట్టాడు.పద్మ ఫిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి రమేష్ ని రిమాండ్ చేసిన అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెద్ది విక్రాంత్ వాదనలు వినిపించాగా కోర్టు కానిస్టేబుల్ శ్రీకాంత్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా,సాక్ష్యదారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ మేఘన నిందితుడు రమేష్ కి మూడు సంవత్సరాలు శిక్ష విధించినట్లు ఎస్.ఐ తెలిపారు.
