ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమపథకాలు
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రజలసమక్షంలో లబ్ధిదారుల ఎన్నిక
సిద్దిపేట జిల్లా
ప్రజా పాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా వంటి 4 పథకాలను అమలు చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం లో గ్రామాల వారీగా గ్రామ సభలు పెట్టి ఈ నాలుగు పథకాలకు లబ్ధిదారులను గ్రామ ప్రజల సమక్షంలోనే గ్రామసభలో ఎంపిక చేస్తున్నారు, కావున వర్గల్ మండల్ మల్లారెడ్డిపల్లి గ్రామంలో గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది, ఈ గ్రామ సభకు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది, లబ్ధిదారుల జాబితాలో కొందరి పేర్లు రానందున గ్రామ సభలో కౌంటర్లు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శి అంబిక, సమక్షంలో గ్రామ ప్రజల నుండి దరఖాస్తులను తీసుకోవడం జరిగింది, ఈ దరఖాస్తులను కూడా వెంటనే పరిశీలించి అర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చడం జరుగుతుంది అని, అర్హులకు అందరికీ ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తుందని అధికారులు ప్రజలకి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల వివిధ శాఖల అధికారులు, మరియు సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి,మల్లారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదగిరి,పిట్ల రాజు,శ్రీనివాస్ రెడ్డి,రాజు గౌడ్,సతీష్,భాస్కర్,పాపయ్య,కనకయ్య తదితరులు పాల్గొన్నారు
