ఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
మర్కూక్ మండల్ లో తెరాస బి సి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారు పాములపర్తి గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ మంజుల గార్ల కుమారుడు,కోడలు శివకుమార్ పూజిత వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది అని సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టాల మహేష్ తదితరులు పాల్గొన్నారు
