— మట్టితో తయారుచేసిన గణపతులే శ్రేష్టం
— 10 సంవత్సరాలనుండి మట్టి గణపతిని ప్రతిష్టిస్తున్న ఆలయ వ్యవస్థాపకులు హరిపంతులు
— ఘనంగా సన్మానించిన రామకోటి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు
మట్టి గణపతులే శ్రేష్టమని శ్రీరామకోటి భక్త సమాజం దార్మిక సేవా సంస్థ వారు మట్టి గణపతులను ప్రోత్సాహస్తుంది. అందులో భాగంగా గత 10 సంవత్సరాల నుండి మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని రామాలయంలో ప్రతిష్టించిన మట్టి గణపతిని సందర్శించి విగ్రహ ప్రతిష్టకు ముఖ్య కారకులైన ఆలయ వ్యవస్థాపకులు హరిపంతులు ని, అలాగే కెసిఆర్ కాలనీ గణేష్ భక్త బృందం వారి ఇరువురిని బుధవారం నాడు ఘనంగా సన్మానించిన రామకోటి సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహిత రామకోటి రామరాజు.
ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ ప్లాస్టరప్ ప్యారిస్తో ముప్పుందని స్వచ్ఛమైన మట్టితో చేసిన గణపతినే ప్రతి ఒక్కరు ప్రతిష్టించి పర్యావరణంలో అందరు బాగా స్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదే విదంగా నిమజ్జన సమయంలో కూడ భగవన్నామ స్మరణతో, భజనలతో గణపతిని నిమజ్జనం చేయాలన్నారు. ఆధ్యాత్మిక సనాతన ధర్మం గురించి అందరు తెలుసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.
