ఆధ్యాత్మికం

నుస్తులపూర్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

103 Views

(తిమ్మాపూర్ అక్టోబర్ 18)

తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,నుస్తులపుర్ సర్పంచ్ రావుల రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు సమక్షంలో ఆనందోత్సవాల మధ్య వేడుకగా నిర్వహించినటువంటి బతుకమ్మ వేడుకలకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి మాధవి , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సతీమణి ఏర్పుల రజియా, జడ్పిటిసి ఇనుకొండ శైలజ జితేందర్ రెడ్డి , ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచ్ రావుల రమేష్ సతీమణి రావుల లక్ష్మి వారికి స్వాగతం పలికారు.. సాంప్రదాయాలు అనుసరిస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించారు..ప్రకృతిలో లభించేటువంటి వివిధ రకాల పూలతో, ఆకులతో అందంగా బతుకమ్మను తయారు చేసి గౌరీ దేవిని ప్రతిష్టించి పల్లెతనాన్ని వివిధ పాటలు పాడుతూ బతుకమ్మను ఆరాధించారు . గ్రామంలోని మహిళలంతా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.వేడుకలలో భాగంగా మహిళలు ప్రదర్శించినటువంటి బతుకమ్మ బతుకమ్మ ఉయాల్లో.. బంగారు బతకమ్మ ఉయాల్లో, ఊరూర వచ్చిందమ్మ బతుకమ్మ తెచ్చిందమ్మ ఆనందం, బతుకమ్మ నృత్యాలు ఆకర్షించాయి. .వివిధ రకాల ప్రసాదాలతో బతుకమ్మకు నైవేధ్యంగా సమర్పించారు..అతిధులకు సాంప్రదాయ రీతిలో వాయనాలను అందజేసారు..

ఈ సందర్భంగా మాజి ఎంపి వినోద్ కుమార్ సతీమణి మాధవి మాట్లాడుతూ…

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అని తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ అని అన్నారు….

ఈ కార్యక్రమంలో బెజ్జంకి ఎంపిపి నిర్మల-లక్ష్మణ్, తిమ్మాపూర్ వైస్ ఎంపిపి సతీమణి రమదేవి, నల్గొండ సర్పంచ్ శోభ, నూస్తులపూర్ ఎంపీటీసీ సతీమణి వనజ, వివిధ గ్రామల మహిళ సర్పంచులు, మహిళ ఎంపిటిసిలు మహిళ వార్డు సభ్యులు, మహిళ నాయకురాలు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *