ఏప్రిల్ 8, 24/7 తెలుగు న్యూస్:ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు
హైదరాబాద్ : ప్రధాని మోడీపై ఎన్నికల సంఘం వద్ద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో.. ముస్లిం లీగ్ తరహాలో ఉన్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6వ తేదీన అజ్మీర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఓ అబద్ధాల పుట్ట అని, భారత్‌ను ముక్కలుగా చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ భావజాలవాదులు గతంలో బ్రిటీష్, ముస్లిం లీగ్‌కు సపోర్టు ఇచ్చారని, స్వతంత్య్ర ఉద్యమం వేళ భారతీయులకు వ్యతిరేకంగా వాళ్లు ప్రవర్తించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మోడీ-షాకు చెందిన రాజకీయ పూర్వీకులు బ్రిటీషర్లు, ముస్లిం లీగ్‌కు మద్దతు ఇచ్చినట్లు ఆరోపించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ న్యాయ పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం లీగ్ వ్యవహార శైలిని బీజేపీ ప్రవర్తిస్తున్నట్లు ఖర్గే తెలిపారు.