ప్రాంతీయం

బి అర్ ఎస్ పార్టి మునిగిపోతున్న నావ

72 Views

తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 08

 

కాంగ్రెస్ ఆహ్వానంతోనే పార్టీలో చేరా

రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

 

బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ అని, పార్టీ నేతల పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఆ పార్టీ పతనానికి కారణమవుతున్నాయని మాజి డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

సోమవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు.

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి లతో కలిసి కడియం శ్రీహరి మాట్లాడుతూ తాను అవకాశవాదిని కాదని తనని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, తాను టిడిపిలో కలిసి పనిచేశామని, ఆ చనువుతోనే సీఎం కలిసి పని చేద్దామని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాడని తెలిపారు. కాంగ్రెస్ పెద్దల ఆహ్వానం మేరకే నేను మా కుమార్తె కడియం కావ్య పార్టీలో చేరామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం అన్ని ప్రాంతాల్లో కొనసాగిందని, తనపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడం వల్లనే ఆ కొద్దిపాటి మెజారిటీ తోనైనా గెలవగలిగానని పేర్కొన్నారు.బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేకమంది నాయకులు పార్టీని వీడినా రాని విమర్శలు తనపై వచ్చాయన్నారు.నిన్నటి వరకు తనతో ఉన్నవారే పార్టీ వీడగానే బురద చల్లుతున్నారని తెలిపారు. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరగడం సహజమేనని తెలిపారు.

ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేనని గుర్తించాననన్నారు.ఎర్రబెల్లి మనవరాలు వయసు ఉన్న అమ్మాయిపై ఓడిపోవడం సిగ్గుచేటన్నారు. ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయడం తగదని బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆఫర్ ను వద్దనుకున్నామని తెలిపారు. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి భారీ మెజారిటీ ఇచ్చిన మాదిరిగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ ఇవ్వాలన్నారు.నా బిడ్డ ను వరంగల్ ప్రజల చేతుల్లో పెడుతున్నానని… ఆశీర్వదించి అక్కున చేర్చుకోవాలన్నారు కడియం కావ్యను గెలిపించుకోవడం చారిత్రక అవసరమన్నారు. బిజెపి అధికారాన్ని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలన్నారు.

ఝాన్సి రెడ్డి కుటుంబంతో 15 సంవత్సరాల అనుబంధం ఉందని, ఒక్కసారిగా పాలకుర్తిలో ప్రభంజనం సృష్టించారన్నారు. అందరి చూపు పాలకుర్తి నియోజకవర్గం పై తిప్పుకున్నారన్నారు.

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ డోర్ తెరవక ముందే పాలకుర్తి లో బిఆర్ఎస్ ను ఖాళీ అవుతుందన్నారు. ఎంతో మంది టచ్ లో ఉన్నారని. చేర్చుకునే టైం వచ్చిందన్నారు. ఊరూరా చేరికలను నిర్వహిస్తామని, నియోజకవర్గాన్ని కాంగ్రెస్ మయం చేస్తామన్నారు. అవాస్తవ ఆరోపణలను  ఎక్కడికక్కడ తిప్పికొట్టండి సోషల్ మీడియాను విరివిగా వాడుకోవాలన్నారు.

 

ఈ సమావేశంలో మాజి టీపీసీసీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, ముత్తినేని సోమేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు హనుమాండ్ల తిరుపతిరెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్,పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగా సురేందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ ఇట్టే శ్యాంసుందర్ రెడ్డి, కౌన్సిలర్లు భూసాని రాము, నర్కూటి గజానంద్,కాంగ్రెస్ నాయకులు జాటోత్ నెహ్రూ నాయక్, చాపల బాపురెడ్డి, విజయ పాల్ రెడ్డి, పెదగాని సోమయ్య,ప్రసాద్ రెడ్డి, బిక్షం గౌడ్, జలకం శ్రీనివాస్, నరేందర్ రెడ్డి,మెరుగు మల్లేశం గౌడ్, అశోక్ రెడ్డి,శ్రావణ్ కుమార్, ధరావత్ సోమన్న,దొంగరి శంకర్, అనిల్, కుషాల్, నల్లపురాజు,ముద్దసాని సురేష్,నర్సయ్య,మనోహర్,కిషన్ యాదవ్,సురేందర్,అనిల్, వరప్రసాద్,వెంకన్న యాదవ్,రాజేష్,దేవుడు,వినోద్ కుమార్,మహేష్ యాదవ్,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Warning
Warning
Warning
Warning

Warning.

Oplus_131072
Oplus_131072
గాదె కృష్ణ పాలకుర్తి కాన్స్టెన్సీ ఇంచార్జ్