24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 10)
తేలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మొన్ననే సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకొని
రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ నేతలు సీతక్క, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
