రాజకీయం

నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వర్దన్నపేట నియోజకవర్గ ప్రజల మధ్యలోనే ఉంటా.

249 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్10)

హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వర్దన్నపేట నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇటీవల మరణించిన జనగామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగుర్ల వెంకన్న, డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, జిల్లా రైతు బందు అధ్యక్షురాలు లలితా యాదవ్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ, సర్వర్, ఆత్మ చైర్మన్లు గుజ్జ గోపాల్ రావు, కందుకూరి చంద్రమోహన్, ఎంపిపిలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *