119 Views
ముస్తాబాద్ ప్రతినిధి అక్టోబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1981 82 పదో తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తమతో కలిసి చదువుకుని ఇటీవల అనారోగ్యంతో మరణించిన కంచరి విశ్వనాథం (57 ) కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల కోసం రూ.10 వేలు ఆర్థికసాయం అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కన్న తల్లి తండ్రులను తోబుట్టీన సోదరులను కోల్పోయిన విశ్వనాథం బ్రహ్మచారి గానే మిగిలిపోయారు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నెల నెల ఇచ్చే పెన్షన్ డబ్బులతో బ్రతుకు వెళ్లదీశాడు అతని అన్నభార్య ప్రతి నెల పెన్షన్ డబ్బుల నుండి 1500 రూపాయలు తీసుకొని విశ్వనాథంకు భోజనం పెట్టేవారు 500 రూపాయలు ఖర్చులకోసం ఇచ్చేవారు 1981 82 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు ఆయనకు పండగల సందర్భంగా డ్రెస్సులు ఖర్చులకోసం డబ్బులు సమకూర్చేవారు ఈరకంగా ఆయన జీవనం సాగింది చివరకు అనారోగ్యంతో విశ్వనాథం మరణించారు. ఆయన దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులకు పూర్వ విద్యార్థులు మీసం రాజం, అవుసుల పురుషోత్తము, శ్రీగాధ రమేష్ , నేవూరి అశోక్ రెడ్డి లు అందజేశారు.


