మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్:అక్టోబర్ 13
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటలకు ఆయన ప్రగతిభవన్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరనున్నారు.
ఉదయం 10 గంటలకు జిల్లాలోని వేల్పూర్‌కు సీఎం చేరుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (77) గురువారం కన్నుమూశారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
మంజులమ్మకు గతంలో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందారు. సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా మంజులమ్మ అంత్యక్రియలకు హాజరుకానున్నారు..
