ప్రాంతీయం

డెంగీ’ ప్రమాద ఘంటికలు

84 Views

డెంగీ’ ప్రమాద ఘంటికలు

రాష్ట్రంలో భారీగా కేసుల నమోదుఅప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణలో జరుగుతున్న జాప్యం బాధితుల ప్రాణాల మీదికి తెస్తోందనే ఆరోపణలున్నాయి. తీవ్ర లక్షణాలు లేకుండానే కొందరిలో ప్రాణాంతకంగా మారుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘ఉదాహరణకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన 24 ఏళ్ల యువకుడు లండన్‌లో ఎంబీఏ పూర్తిచేసి, సోదరుడి నిశ్చితార్థ వేడుకల కోసం ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. ఆదివారం రాత్రి అతనిలో స్వల్ప జ్వర లక్షణాలు బయటపడ్డాయి. సోమవారం మధ్యాహ్నానికి జ్వరం తీవ్రమైంది. మంగళవారం ఉదయానికే పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మా బిడ్డ మృతి చెందాడ’ని కుటుంబ సభ్యులు పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మంథని చుట్టుపక్కలే మూడు నాలుగు రోజుల వ్యవధిలో నలుగురు యువకులు ఇదే తరహాలో మరణించినట్టు బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత, రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత నిర్ధారణ సమాచారం రావడంలో జాప్యం జరగడం బాధితుల్లో లక్షణాలు తీవ్రమయ్యేందుకు, మరణాలకు కారణమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ ద్వారా సాధ్యమైనంత త్వరగా వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేలా చూస్తున్నామని, ఇటీవల సాంకేతిక పరమైన సమస్యలతో రెండు రోజులపాటు నివేదికలు ఇవ్వడంలో జాప్యం జరిగిందని వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. జ్వర లక్షణాలు బయటపడిన వెంటనే అప్రమత్తం కావాలని, వేగంగా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మెరుగైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

కొందరు సాధారణ జ్వరంగానే భావించి మందుల దుకాణాల్లో ఔషధాలు తెచ్చుకుని వినియోగిస్తున్నారు. మరికొందరు ఆర్‌ఎంపీలను ఆశ్రయించి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయిన తర్వాత ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతోంది.

ప్రభుత్వ వైద్యులు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *