Breaking News

అంగన్వాడీ సెంటర్లకు రాగి లడ్డులు పంపిణీ చేసిన

172 Views

*మేజర్ గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు *

పిల్లలు, గర్భిణీలలో పోషకాహార లోపం నివారణ లక్ష్యంగా.

*రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారి ఆదేశాల మేరకు.

గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు ఆధ్వర్యంలో. శనివారం
పట్టణ కేంద్రంలో ఉన్న అంగన్వాడి సెంటర్లలోని పిల్లలు గర్భిణీలను స్థానిక గాంధీ పాఠశాల కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాగి లడ్డూల ను పంపిణీ చేయడం జరిగింది.
మేజర్ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ. అంగన్వాడి సెంటర్ల ద్వారా పోషణ మాసం పోషణ అభియాన్ కార్యక్రమాలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం, పుట్టబోయే, పుట్టిన ప్రతి ఒక్క పిల్లవారు పౌష్టికంగా ఉండాలని, మరో బాహుబలి గా తయారై నవ సమాజ స్థాపన నిర్మించాలని, గ్రామపంచాయతీ నిధుల నుండి ప్రతి ఈ శనివారమే కాకుండా మాసం మొత్తం అందిస్తామని వారన్నారు. గ్రామస్థాయి అధికారులు ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ సూపర్వైజర్ అరవింద , ఉప సర్పంచ్ సింగారపు నాగరాజుగౌడ్, పంచాయతీ కార్యదర్శి మజీద్, వార్డు సభ్యులు రెడ్డి మల్ల రాజనర్సు, అంగన్వాడీ టీచర్లు సృజన వాణి, ప్రశాంతి, మంజుల, రాధమ్మ, ప్రమీల, భాగ్యలక్ష్మి, పద్మ, మమత, శోభ, రాజమణి, సరోజన,ఏఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna