గ్రూప్-4 ప్రిలిమినరీ కీ విడుదల.. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు
TS: గ్రూప్-4 ప్రిలిమినరీ కీని టీఎస్‌పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్-4 కేటగిరిలో 8,039 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 1వ తేదీన టీఎస్‌పీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూలై 1వ తేదీన పరీక్ష నిర్వహించగా.. పేపర్-1కు 7,63,835 మంది, పేపర్-2కు 7,61,026 మంది అభ్యర్థులు.*
*ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల ఓఎన్‌ఆర్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను కూడా https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో కమీషన్ అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ 27వ తేదీ వరకు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ప్రిలిమనరీ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే కమీషన్ వెబ్‌సైట్ తెలియజేయాలని సూచించింది. అభ్యర్థులు నేరుగా, పోస్ట్ లేదా మెయిల్ ద్వారా తెలిపిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మట్‌లో జతచేయాలని తెలిపారు. గ్రూప్-4 అక్టోబర్ నెలలో ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది.*
