ప్రాంతీయం

అక్రమంగా గంజాయి సేవిస్తూ తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ 230 గ్రాముల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడిస్తున్న సిరిసిల్ల రూరల్ ఉపేందర్

84 Views

సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తో కలసి వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ ఉపేందర్.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం,మండపెల్లి డబుల్ బెడ్ రూమ్ వద్ద తేదీ 26-06-2023 రోజున గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం రాగా తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తన సిబ్బంది నరేందర్ ,సంపత్ తో కలసి సోమవారం రోజున ఉదయం 11 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లిగా ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి తిరుగుతూ కనిపించగ అతన్ని పట్టుకొని తనిఖీ చేయగా అతని వద్ద 230 గ్రాముల గంజాయి దొరకగా అట్టి వ్యక్తిని పట్టుకొని విచారించగా తన పేరు వడిచర్ల జాన్ ప్రతాప్ రెడ్డి s/o శివ రెడ్డి r/o నాంపల్లి గ్రామం వేములవాడ మండలం అని,జాన్ ప్రతాప్ రెడ్డి గంజాయి తగడమే కాకుండా అమ్ముతాడాని, ఇతని మీద వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని అట్టి వ్యక్తిని అరెస్ట్ చేసి 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కి పోయింపనైనది అని సి.ఐ ఉపేందర్ గారు తెలిపారు..యువతకు పోలీస్ వారి విజ్ఞప్తి గంజాయి లాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం తాగడం చట్ట రీత్యా నేరం గంజాయి సంబంధిత సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అన్నారు..

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *