మంచిర్యాల నియోజకవర్గం.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు పొక్కిరాల ప్రేమ సాగర్ రావు.
కాలేశ్వరం నీటిని వినియోగించుకోకుండా కోటి 53 లక్షల టన్నుల వరిని పండించమని మంచిర్యాల ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఒక్క లీటరు నీటిని తీసుకోకుండా ఒక కోటి 53 లక్షల టన్నుల వడ్లను పండించామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బిఆర్ఎస్ పార్టీ నాయకుల విధానాలపై విరుచుకుపడ్డారు. గత బిఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులు ఎంతో నష్ట పోయారనీ విమర్శించారు. ఒక్కొక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారనీ అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని దోచుకున్నారనీ తెలిపారు. కాళేశ్వరం పేరుతో ఆర్థిక దోపిడీ కి పాల్పడ్డారనీ విమర్శించారు. 16 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలను పెంచామని అన్నారు. 2లక్షల రూపాయల రుణమాఫీ 89 శాతం పూర్తి అయ్యిందనీ కొంత మంది రైతుల డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడంతో రుణమాఫీ కాలేదు, త్వరలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అప్పులకు ఇప్పటివరకు 62 వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లించామని అన్నారు. స్థానిక బిజెపి పార్టీ నాయకులు కొత్త బిచ్చగాళ్ల లాగా మాట్లాడుతున్నారనీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయ రంగంపై 54 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి రైతులను ఆదుకున్నమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో పొందు పరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 155 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.





