మంచిర్యాల జిల్లా.
బీసీల నాయకత్వంలో బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుదాం.
మంచిర్యాల జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 20 వ తారీకు బుధవారం రోజున లయన్స్ క్లబ్, 100 ఫీట్స్ రోడ్, మంచిర్యాల నందు బీసీ రాజ్యాధికారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టి లు అందరు కలిసి కట్టుగా ముందుకు రావాలి అని బీసీ రాజ్యాధికార సభ కు సంభందించిన పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా బీసీ జేఏసీ నాయకులు ఒడ్డేపల్లి మనోహర్, మహేష్ వర్మ మాట్లాడుతూ ఈ రాష్ట్రము లో బీసీ ల రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అని బీసీ ల నాయకత్వం లో ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనారిటీ లను కలుపుకొని బహుజన రాజ్యాధికారం సాధించుకోవడం కోసం అందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలి, ఈ సమాజంలో 90% మనం యున్నాం, మన ఓటు మనమే వేసుకోవాలి, అని అందుకోసం మంచిర్యాల జిల్లాలో 20 వ తారీకు సభ కు *మన బీసీ ల ఆశజ్యోతి MLC తీన్మార్ మల్లన్న , బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్* సంగం సూర్యారావు, వట్టే జానయ్య యాదవ్, బీసీ ఉద్యమకారుడు హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు,బత్తుల సిద్దేశ్వర తదితరులు పాల్గొంటారు. కావున మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘం నాయకులు బీసీ ప్రజలు, మహిళలు విద్యార్థులు అధిక పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకున్నారు.
ఈ సమావేశంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు యాదబోయిన రాజన్న యాదవ్ తులా మధుసూదన్,వైద్య భాస్కర్ దుర్గం రాజేశం గౌడ్, గజ్జెల్లి వెంకటయ్య, గరిగ చే రాలు, పాకాల దినకర్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
