ఎల్లారెడ్డిపేట మండలంలో దీపావళి సందర్భంగా, కాకర్స్& టపాసులు అమ్మే షాపు యజమానులు పోలీసు మధ్యలో తీసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు గురువారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ….షాపులను ఏర్పాటు చేయు వారందరూ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని, అట్టి షాపులను కచ్చితంగా జనావాసాలకు దూరంగా బహిరంగ ప్రదేశాలలో షాపులను ఏర్పాటు చేయాలన్నారు. షాపుకు, షాపుకు మధ్య దూరం ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, ఏదైనా ఫైర్ కు సంబంధించిన సంఘటన జరిగితే వాటిని నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, మంటలను ఆర్పటానికి వాటరు, ఫైర్ ఎగ్జిక్యూసర్ , ఇసుక, అందుబాటులో ఉంచుకోవాలి, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అట్టి షాపు యజమాని పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎలాంటి పర్మిషన్ లేకుండా మరియు సరియైన జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరైనా టపాసుల షాపులను నిర్వహించినట్లయితే వారి పైన సరైన చర్యలు తీసుకోబడును అని ఎస్ఐ వి. శేఖర్ మండల ప్రజలకు తెలిపారు.
