Breaking News

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు

13 Views

24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు..వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు

కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495 కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 939868424.

రాజన్న సిరిసిల్ల, ఆగష్టు 16
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వే ల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు.

ఈ నెల 16 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు అధికారులు అందుబాటులో ఉండి, వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారు. 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 లను వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు సూచించారు.

జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ హెడ్ క్వార్టర్స్ , క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రా వద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

 

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *