Breaking News

భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

67 Views

రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పరిధిలోని ప్రజలు మరియు మత్స్య కారులు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.  తెలియజేశారు.రాగల 24-48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా లోని మత్స్య కారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని తెలియజేయడమైనది.మానేరు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నర్మాల ఎగువ మానేరు డ్యామ్, మధ్య మానేరు జలాశయం అన్నపూర్ణ జలాశయం పరిధిలో ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళకూడదని తెలియజేయడమైనది. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు,నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళరాదు. జలాశయాలు, చెరువులు,వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు మత్స్యకారులు,ప్రజలు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదు. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ప్రతి ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు మీ సంఘ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు,రెవెన్యూ సిబ్బందికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం కొరకు సమాచారం అందించగలరు.మీ మండలాల పరిధిలో గల ఎంపిక చేసిన ఈతగాళ్ల జాబితాను సంబంధిత మండలాల తహసీల్దార్ లకు, మున్సిపల్ కమిషనర్ లకు అందించడం జరిగింది. కావున, ఎంపిక చేయబడిన మత్స్యకారులు / ఈతగాళ్లు తప్పకుండా మీ మండలం లోని తహసీల్దార్ లు అందుబాటులో ఉండవలసినదిగా రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ ఆదేశించడమైనది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *