ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా కోరుట్ల పేట గ్రామం నుండి బొప్పాపూర్ గ్రామం వైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ ను పట్టుకొని విచారించగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్ ను పట్టుకొని ,టిప్పర్ ను,డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ మాలోతు మోతిరామ్ తెలిపారు.
ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట గ్రామం నుండి బొప్పాపూర్ గ్రామంవైపు మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ లారీని ఆపి నట్లు డ్రైవర్ ను విచారించగా తన పేరు హరాలే వినోద్ ఎల్లారెడ్డి పేటకు చెందిన వ్యక్తిని అని తెలిపాడని ఎస్ ఐ తెలిపారు.
ఎల్లారెడ్డిపేట మండలం లోని రాజన్నపేట కు చెందిన టిప్పర్ యజమాని ఉడుగుల సురేందర్ ఆదేశాలతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు టిప్పర్ డ్రైవర్ హెరాలే వినోద్ తెలిపాడడని,టిప్పర్ డ్రైవర్ తెలిపిన వివరాలతో అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ ను,టిప్పర్ డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి టిప్పర్ యజమాని ఉడుగుల సురేందర్ పై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ మాలోతు తుకారాం తెలిపారు.
