మంచిర్యాల జిల్లా.
యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్, యూనియన్ అసోసియేషన్ కరీంనగర్ రీజియన్ సెక్రటరీ చెగొండ వెంకటేష్ ఆధ్వర్యంలో కీ. శే. నల్లూరు వెంకట సత్యనారాయణ జయంతి సందర్బంగా రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్ వారి సహకారం తో
యూనియన్ బ్యాంకు ఐబీ చౌరస్తా మంచిర్యాల యందు రక్త దాన శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ శిబిరంలో 25 మంది రక్త దానం చేసారు. అట్టి రక్త యూనిట్స్ లను స్వీకరించి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల.
జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్ వారికి యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్, యూనియన్ అసోసియేషన్ కరీంనగర్ రీజియన్ సెక్రటరీ చెగొండ వెంకటేష్ వారు అందజేయడం జరిగింది. అదేవిదంగా
మంచిర్యాల జిల్లాలోని అన్ని యూనియన్ బ్యాంక్ సిబ్బందులు రక్త దానం శిబిరం లో పాల్గొని రక్త దానం చేశారు. రక్త దాతలను యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్, యూనియన్ అసోసియేషన్ కరీంనగర్ రీజియన్ సెక్రటరీ చెగొండ వెంకటేష్ మరియు వారి బృందం రక్త దాతలను అభినందించిన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ స్టాఫ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, రహీం బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ రహీం, ప్రేమ్ కుమార్ సింగ్, మరియు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
