ప్రాంతీయం

పాఠశాలలో ముగిసిన బతుకమ్మ సంబరాలు

37 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌.ఎస్‌.ఎస్‌) యూనిట్–1, యూనిట్–2 సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్షాకాల శిబిరం దొమ్మాట, గాజులపల్లిలో వారం రోజులపాటు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా యూనిట్–1 ప్రోగ్రామ్ ఆఫీసర్ మంగతా నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో నెలకొన్న సామాజిక సమస్యలను, రుగ్మతలను లోతుగా అవగాహన చేసుకుని, భవిష్యత్తులో వాటి నివారణకు చైతన్యవంతులుగా ముందుకు సాగాలని సూచించారు. యూనిట్–2 ప్రోగ్రామ్ ఆఫీసర్ సంపత్ మాట్లాడుతూ […]

ప్రాంతీయం

సహాయ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

27 Viewsసిద్ధిపేట జిల్లా గజ్వేల్ 13 వ వార్డ్ వాసవి నగర్ లో సహాయ యూత్ ఆధ్వర్యంలో సహాయ యూత్ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు నందగిరి శ్యాంప్రసాద్ శర్మ మాట్లాడుతూ సహాయ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మ వారి దయ ఉంటుందని, దైవ నామస్మరణతోనే […]

ప్రాంతీయం

అధ్యాపక, తల్లిదండ్రుల సమావేశ కార్యక్రమం

44 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్‌లో శుక్రవారం జరిగిన అధ్యాపకులు, తల్లిదండ్రుల సమావేశం పండుగ వాతావరణంలో జరిగింది. విద్యార్థుల విద్యా ప్రగతిని, అకాడమిక్ పురోగతిని వ్యక్తిగతంగా తెలియజేస్తూ, ఇటీవల కళాశాల విభాగంలో అమలు చేస్తున్న సంస్కరణలు హెల్ప్ కార్యక్రమంలో భాగమని ప్రిన్సిపాల్ మధు శ్రీ వాత్సవ సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సహజ సామర్థ్యాన్ని గుర్తించి, సరైన దిశలో మలచడానికి ప్రతి వారం యోగా, ధ్యానం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి శనివారం ఆటలు, […]

ప్రాంతీయం

ఘనంగా బతుకమ్మ సంబరాలు

42 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సి. సంతోష్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకలలో భాగంగా ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. రంగురంగుల పూలతో, సాంప్రదాయ క్రీడలతో అట్టహాసంగా సాగిన బతుకమ్మ సంబరాలు స్థానిక ప్రజలను ఆకట్టుకున్నాయి. Manne Ganesh Dubbaka constancy 9701820298

ప్రాంతీయం

చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు

78 Viewsతెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు రాయపోల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రజక రిజర్వేషన్ సమితి మండల అధ్యక్షులు వడ్లకొండ బిక్షపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్లకొండ బిక్షపతి మాట్లాడుతూ ఐలమ్మ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి, భూమి కోసం భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చూపిన ధైర్య సాహసాలు సమాజానికి […]

ప్రాంతీయం

ఊరెళ్తున్నారా… ఊడ్చేస్తారు జాగ్రత్త..! రాయపోల్ ఎస్ఐ కె.మానస

41 Viewsబతుకమ్మ, దసరా పండగల సందర్భంగా కుటుంబాలు సొంత ఊర్లకు బయలుదేరుతుంటారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నెల 28 నుంచి కళాశాలలకు కూడా సెలవులు ఇవ్వనున్నారు. చాలా కుటుంబాలు తమ సొంత గ్రామాలకు చేరుకుంటారు. తిరిగి అక్టోబర్ 3 తర్వాత మాత్రమే తమ నివాసాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ఖాళీ సమయంలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు జరిగే అవకాశం ఉందని రాయపోల్ ఎస్ఐ కె.మానస అన్నారు. […]

ప్రాంతీయం

మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

74 Viewsమృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన -మేకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా మర్కుక్, సెప్టెంబర్ 26 TS 24 /7తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన ఉప్పరి గంగవ్వ,అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్,బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్, ఈ రోజు మృతిరాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. యాదగిరి, మేకల డెవిడ్, బాలకృష్ణ,తదితరులు […]

Breaking News ప్రాంతీయం

బతుకమ్మ చీరలు పంచేదెన్నడు .!?

270 Views   బతుకమ్మ చీరలు పoచేదెప్పుడు..? మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ పండుగ అనేది చారిత్రాత్మక పండగ కాగా ఆ పండక్కి చీరలు ఇస్తామని ఒకటి కాదు రెండు ఇస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం పెద్ద బతుకమ్మ పండగ దగ్గరకు వస్తున్నా ఇప్పటివరకు చీరల పంపిణీ మొదలు పెట్టలేదని ఇంకెప్పుడు చీరలు పంపిణీ చేస్తారని బిజెపి పార్టీ మహిళా మోర్చా ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ ప్రభుత్వాన్ని […]

Breaking News ప్రాంతీయం

నూతన పాఠశాల భవన మంజూరు కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేత

42 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గత ఏడాది కాలం నుండి పెండింగ్లో ఉండి మంజూరు కు నోచుకొని ఎం.పి .పీ . ఎస్ పాములపర్తి ఎచ్ . డబ్ల్యూ పాఠశాలకు నూతన పాఠశాల భవనం మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రజావాణి లో సిద్దిపేట కలెక్టర్ కి వినతిపత్రం అందించిన కొండనోళ్ళ నరేష్, కర్రోళ్ల బాలకిషన్, శ్రీగిరిపల్లి ప్రవీణ్,గిద్దల కనకరాజు,పలువురు గ్రామస్థులు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

45 Views30 సంవత్సరాల తర్వాత బాల్యమిత్రులు ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-1996 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థిని, విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన్ని ఏ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గురువులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని […]