తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు రాయపోల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రజక రిజర్వేషన్ సమితి మండల అధ్యక్షులు వడ్లకొండ బిక్షపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్లకొండ బిక్షపతి మాట్లాడుతూ ఐలమ్మ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి, భూమి కోసం భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చూపిన ధైర్య సాహసాలు సమాజానికి స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ గౌరీగారి పరశురాములు, యువజన నాయకులు చింతకింది కర్ణాకర్, చింతకింది కృష్ణ తదితరులు మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వానికి, రజాకారుల ఆగడాలకు ఎదురొడ్డి పేదల దీనదశను వెన్నుదన్నుగా నిలబెట్టిన ఐలమ్మ పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతకింది మంజూరు, పీర్లపల్లి రవి, మహేందర్, చెప్పాల స్వామి, చింతకింది మహేష్, మైసిగారి బుధవ్వ, బాలమణి, మల్లవ్వ, రామవ్వ, మల్లేష్, స్వామి, ప్రవీణ్, యాదయ్య, గణేష్, మల్లయ్య, లచ్చయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





