సిద్ధిపేట జిల్లా గజ్వేల్ 13 వ వార్డ్ వాసవి నగర్ లో సహాయ యూత్ ఆధ్వర్యంలో సహాయ యూత్ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు నందగిరి శ్యాంప్రసాద్ శర్మ మాట్లాడుతూ సహాయ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మ వారి దయ ఉంటుందని, దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ సహానజ్ సమీర్,సహాయ యూత్ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.





