ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్‌లో శుక్రవారం జరిగిన అధ్యాపకులు, తల్లిదండ్రుల సమావేశం పండుగ వాతావరణంలో జరిగింది. విద్యార్థుల విద్యా ప్రగతిని, అకాడమిక్ పురోగతిని వ్యక్తిగతంగా తెలియజేస్తూ, ఇటీవల కళాశాల విభాగంలో అమలు చేస్తున్న సంస్కరణలు హెల్ప్ కార్యక్రమంలో భాగమని ప్రిన్సిపాల్ మధు శ్రీ వాత్సవ సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సహజ సామర్థ్యాన్ని గుర్తించి, సరైన దిశలో మలచడానికి ప్రతి వారం యోగా, ధ్యానం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి శనివారం ఆటలు, క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల శారీరక–మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రుల సూచనలు, సలహాలను గౌరవంగా పరిగణనలోకి తీసుకొని విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంలో మరింత కృషి చేస్తామని, విద్యార్థుల అభివృద్ధికి కళాశాల సిబ్బందంతా అంకితభావంతో కట్టుబడి ఉన్నారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మధ్యాహ్నం బతుకమ్మ ఉత్సవాలను కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజు, లక్ష్మినారాయణ, సుధాకర్, మంగతానాయక్, శివకుమార్ సంపత్, దయానంద్, శ్రీనివాస్ రెడ్డి, భాగ్యమ్మ, శ్రీనివాస్, రమ్య పాల్గొన్నారు.





