30 సంవత్సరాల తర్వాత బాల్యమిత్రులు ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-1996 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థిని, విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన్ని ఏ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గురువులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తుందని విద్యార్థులు ఉన్నతని తెలుపుకుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గురువులు చూపించిన సన్మార్గంలో నడిచి ప్రస్తుతం ప్రతి విద్యార్థి వివిధ వృత్తుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనంద జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రేమకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అనంతరం గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లింగారెడ్డి, నాగిరెడ్డి, ఆది నర్సింలు,పూర్వ విద్యార్థులు సత్యనారాయణ గౌడ్, కనక రాములు, స్వామి, బాబ, తదితరులు పాల్గొన్నారు.





