
Your message has been sent
Your message has been sent
బతుకమ్మ చీరలు పoచేదెప్పుడు..?
మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ
తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ పండుగ అనేది చారిత్రాత్మక పండగ కాగా ఆ పండక్కి చీరలు ఇస్తామని ఒకటి కాదు రెండు ఇస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం పెద్ద బతుకమ్మ పండగ దగ్గరకు వస్తున్నా ఇప్పటివరకు చీరల పంపిణీ మొదలు పెట్టలేదని ఇంకెప్పుడు చీరలు పంపిణీ చేస్తారని బిజెపి పార్టీ మహిళా మోర్చా ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికీ కనీసం గ్రామ పంచాయతీలకు చీరలు చేరుకోలేదని పండక్కి మూడు రోజులే సమయం మిగిలి ఉండగా అందులో ఒక రోజు సెలవు దినం ఆదివారం కావడంతో ఇంకెప్పుడు బతుకమ్మ పండగకి చీరలు కానుకగా అందిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.హామీలు ఇవ్వడం అమలు చేయకపోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని అన్నారు.చీరల తయారీ పూర్తయింది అన్న ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో పండగలోపు చీరల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Your message has been sent





