సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సి. సంతోష్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకలలో భాగంగా ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. రంగురంగుల పూలతో, సాంప్రదాయ క్రీడలతో అట్టహాసంగా సాగిన బతుకమ్మ సంబరాలు స్థానిక ప్రజలను ఆకట్టుకున్నాయి.





